కిష్టయ్య మృతికి సంతాపం తెలిపిన మాజీ మంత్రి
26-08-2026 07:50 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు విజ్జగిరి నారాయణ అన్న విజ్జగిరి కిష్టయ్య మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నల్లూర్ గ్రామంలోని వారి నివాసానికి మాజీమంత్రి జోగు రామన్న చేరుకొని ఆయన చిత్రపటానికి పూలతో శ్రద్ధాంజలి ఘటించి సంతపాన్ని ప్రకటించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ నాయకులు యాసం నర్సింగరావు, లింగారెడ్డి, నల్ల మహేందర్ తదితరులు ఉన్నారు.






