చీనూర్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం
నాగిరెడ్డిపేట్, జూన్ 18 (విజయక్రాంతి): మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల చీనూర్లో గురువారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించి వారి విద్యా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు.
అనంతరం విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డి,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాసుదేవరావు, గ్రామ సర్పంచ్ మురళి గౌడ్,గ్రామ కార్యదర్శి అనిత,పురోహితులు గోపాలచారి పంతులు,గ్రామ పెద్ద గంపల వెంకన్న, విద్యార్థుల,తల్లిదండ్రులు పాల్గొన్నారు.






