1 August, 2026 | 2:57 AM

మారుతి సేవలు మరువలేనివి

01-08-2026 12:00 AM

సింగరేణి జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి 

ఉద్యోగ విరమణ పొందిన మారుతికి ఘన సన్మానం

భూపాలపల్లి, టౌన్, జూలై 31 (విజయ క్రాంతి): మారుతి సేవలు మరువలేనివని సింగరేణి జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సింగరేణి సంస్థలో 37 సంవత్సరాల పాటు నిబద్ధతతో సేవలందించిన పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి  పదవీ విరమణ పొందిన సందర్భంగా భూపాలపల్లి ప్రాంత ప్రధాన కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి హాజరై, మారుతి దంపతులను  శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమం, పారిశ్రామిక సత్సంబంధాల పరిరక్షణ, పరిపాలన బలోపేతానికి మారుతి  చేసిన సేవలు విశేషమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

మారుతి  మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో పనిచేయడం తనకు మరపురాని అనుభవమని పేర్కొని, యాజమాన్యం, సహోద్యోగులు, ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (సివిల్) రవికుమార్, ఏజీఎం (ఐఈడి) జోతి, ఏరియా ఇంజనీర్ పి.వి. సాంబశివరావు, డీజీఎం (ఎఫ్ అండ్ ఏ) పి. రాజేశ్వర్, ఏరియా సేఫ్టీ అధికారి మాటూరి రవీందర్, ఏరియా సర్వే అధికారి శైలేంద్ర కుమార్, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యామ్ సుందర్, అన్ని విభాగాల అధికారులు, ఏఐటీయూసీ శాఖ కార్యదర్శి మోట పలుకుల రమేష్, ఐఎన్టీయూసీ శాఖ ఉపాధ్యక్షుడు బి. మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.