1 August, 2026 | 1:55 AM

పంట మార్పిడితో భూసార పరిరక్షణ

01-08-2026 12:00 AM

కలెక్టర్ స్నేహ శబరిష్

మహబూబాబాద్, జూలై 31 (విజయక్రాంతి): పంట మార్పిడితో భూసారం పెంపొందుతుందని, సేంద్రియ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని, రైతులు వైవిధ్య వ్యవసాయ విధానాన్ని అవలంబించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కోరారు. శుక్రవారం కొత్తగూడ మండలంలో పంట మార్పిడి విధానం కార్యక్రమంలో భాగంగా రైతు బానోతు బిచ్చ, బానోతు సుమన్ పొలంలో ప్రాజెక్టు వైవిధ్యం కింద జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు.

అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రక్రియ పరిశీలించి లబ్ధిదారులు బంగారి సాంబలక్ష్మి, గట్టి సుగుణతో మాట్లాడి గృహాలను వెంటనే నిర్మించుకో వాలని సూచించారు. గాంధీనగర్ లోని గిరిజన బాలికల గురుకులమును పరిశీలించి విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు.

అనంతరం వారితో మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలను, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికల గురించి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశీ రామ్ నాయక్, ఏడిఏ శ్రీనివాసరావు, తహసిల్దార్ రాజు, ఎంపీడీవో అనురాధ పాల్గొన్నారు.