మంథని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అమరవీరుల దినోత్సవం
మంథని,(విజయక్రాంతి): మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని ఐక్యుఏసి చరిత్ర విభాగం ఆధ్వర్యంలో స్వాతంత్ర ఉద్యమంలో అమరులైన భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు గణనీయమైన నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ పరిషయ్య మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల దేశభక్తి, త్యాగాలను కొనియాడారు.
చరిత్ర అధ్యాపకులు సతీష్ మాట్లాడుతూ... జాతీయ ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో భగత్ సింగ్ ముఖ్యమైన వారిని చంద్రశేఖర్ ఆజాద్ తో కలిసి హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ ను స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవ పంథా లో ఉద్యమాన్ని సాగించారని, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇచ్చారని ఇతన్ని బ్రిటిష్ వారు లాహోర్ కుట్ర కేసులో నిందితుడిగా ప్రకటించి 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరి తీశారు.
వీరి మరణంతో దేశంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడిందని వీరి త్యాగాలతో భారతావని స్వేచ్ఛ వాయువులను పీల్చినదని వీరి ఆశయాలను సాధించడంలో ప్రతి ఒక్క భారతీయుడు ముందుండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యు ఏసి కో ఆర్డినేటర్ కృష్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్. లక్ష్మీనారాయణ, అధ్యాపకులు అమర్నాథ్, ముకుందం, ఫర్జానా, మానస, దుర్గం కృష్ణ, శేఖర్, శ్రీధర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




