30 July, 2026 | 5:17 PM

Breaking News

భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •   మంథనిలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం   •   ఆగస్టు 1లోగా సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ కన్ఫర్మేషన్ పూర్తి చేసుకోవాలి   •   వాచ్‌మెన్‌ను కాపాడిన మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకవర్గం   •   దేశంలో విమాన ఛార్జీలపై నియంత్రణేది?   •   కరీంనగర్ కళాకారుల బోనాల జాతర పోస్టర్‌ ఆవిష్కరణ   •   బెల్ట్‌షాపుల మూసివేతకు పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ తీర్మానం   •   ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   ప్రమాదమని తెలిస్తే కాల్ చేయండి   •   లైసెన్స్ లేని, నాణ్యత లేని విక్రయదారులకు బారీ జరిమానా   •  

మరిపెడ నూతన ఎస్సైని కలిసిన మరిపెడ యాదవ్ సంఘం నాయకులు

22-11-2025 08:14 PM

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన వీరభద్ర రావు యాదవ్ ను మరిపెడ యాదవ్ సంఘం నాయకులు  మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సై  వీరభద్ర రావు యాదవ్ మాట్లాడుతూ... యాదవులు కల్మషం లేని వారని ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారని మాట ఇచ్చి తప్పరని నమ్మకాని మారుపేరుగా చరిత్రలు వున్నాయని కాల క్రమేనా గుర్తింపుకు నోచుకోవడం లేదని అది యాదవ్ సోదరులు గమనించి అందరు కలిసి కట్టుగా వుండి పూర్వ వైభవం వచ్చేలా అందరు కలిసి వునడాలని యాదవ్ యువకులు అన్ని ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో రాణించి పేరు ప్రక్యాతలు సాదించుకోవాలని అన్నారు. పార్టీ లకతీతంగా న్యాయబద్ధంగా పనిచేయాలని యాదవ్ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మరిపెడ మండల యాదవ సంఘ నాయకులూ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.