16 July, 2026 | 2:31 PM

Breaking News

జగ్గారం లో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె   •   సీతారామ సాగర్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేకాఫ్ పాయింట్ ను పరిశీలించిన మంత్రులు   •   హిందూ విద్యార్థిని కల్మాను చదవమనడం బాధకరం   •   హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు: బండి సంజయ్   •   అమెరికా ఫెడ్ రిజర్వ్ లో ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక బాధ్యతలు   •   అక్రమంగా తరలిస్తున్న 20 లీటర్ల గుడుంబా పట్టివేత   •   సోయా పంట తెగులు రైతన్న దిగులు   •   గోల్కొండలో ఘనంగా ప్రారంభమైన ఆషాఢమాస బోనాలు   •   ఉప్పుంతలలో వీధికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు   •   నాణ్యతలో రాజీ వద్దు.. పాఠశాల నిర్మాణాలు వేగవంతం చేయాలి   •  

వాహన తనిఖీల్లో గంజాయి పట్టివేత

15-02-2026 12:00 AM

ముగ్గురు వ్యక్తుల అరెస్టు రిమాండ్‌కు తరలింపు

మేడిపల్లి,ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): గంజాయితో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించిన సంఘటన మల్కాజ్ గిరి కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం పోలీస్ సిబ్బంది బోడుప్పల్ ఇందిరానగర్ ఏరియా లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్య క్తులను పట్టుకొనగా వారి దగ్గర ఒక బ్యాగ్ లభ్యమయింది.

బ్యాగును పరిశీలించి చూడ గా అందులో  గంజాయి దొరికింది వెంటనే అట్టి వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా పర్వతాపూర్ మేడిపల్లికి చెందిన అదెల తేజ(33) తండ్రి నరసింహ, ఫిర్జాదిగూడ కు చెందిన మండోలం రుద్ర సాయి (27) పకీరప్ప, ఇందిరానగర్ బోడుప్పల్ కు చెందిన దామరోళ్ల భాస్కర్ (19) తండ్రి రాజిరెడ్డిలుగా గుర్తించి ముగ్గురు వ్యక్తులను అదుపు లోకి తీసుకొని వారి దగ్గర నుండి గంజాయి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనపరచుకొని చట్ట ప్రకారం ముగ్గురు వ్యక్తులను రిమాండ్ కు తరలించడం జరిగిందని మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి తెలిపారు.