జగ్గారం లో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె
16-07-2026 02:29 PM
దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని జగ్గారం గ్రామపంచాయతీలో అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ జగ్గారం ప్రధాన రహదారి వద్ద రూ.25. లక్షల వ్యయంతో నిర్మించబోయే కల్వర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పట్వారిగూడెం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన చెలికాని రంగారావు దశదిన కార్యక్రమంలో పాల్గొనివారి చిత్రపటానికి పూలమాలలు వేసి, వారి కుటంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






