calender_icon.png 15 February, 2026 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లలో మోసం చేసిన కాంగ్రెస్

15-02-2026 12:00:00 AM

మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థుల ఘన విజయం

బీసీల విజయం ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

ముషీరాబాద్, ఫిబ్రవరి14 (విజయక్రాంతి): బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు సత్తా చాటి విజయం సాధిం చి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పారని జాతీ య బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జసత్యం అన్నారు. ఈ మేరకు శనివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గుజ్జ సత్యం మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ పార్టీల వైఖరిని తీవ్రంగా విమర్శించారు.

బీసీ రిజర్వేషన్ బిల్లును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని, అమలు విషయంలో మాత్రం అన్ని పార్టీలు బీసీలను మోసం చేశాయని ఆయన ఆరోపించారు. ఎన్నో హామీలు ఇచ్చి నా అసలు బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. తాజా మున్సిపల్ ఎన్నికల్లో 116 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో మొ త్తం 2900కు పైగా ఎన్నికలు జరిగిన వార్డు ల్లో మెజారిటీ బీసీ అభ్యర్థులు విజయాలు సాధించడం గొప్ప విషయమన్నారు.

ఇందులో ఎక్కువ భాగం జనరల్ సీట్లలోనే వచ్చాయని, ఇది బీసీల ఐక్యతకు నిదర్శనమ న్నారు. ఈ ఎన్నికల్లో బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా చూసే రోజులు పోయాయన్నారు. ఇకపై మా హక్కులను విస్మరిస్తే ప్రజాస్వా మ్య మార్గంలో మరిన్ని తీర్పులు ఇస్తామని గుజ్జ సత్యం హెచ్చరించారు.

గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ బీసీ అభ్యర్థులు జనరల్ సీట్లలో 43 శాతం సాధించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో 53 శాతం విజయాలు సాధించడం చారిత్రా త్మకమన్నారు. బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుం డ్రు కుమారస్వామి, బీసీ జేఏసీ కన్వీనర్ రాజునేత, ఓబీసీ జాతీయ అధ్యక్షులు ఐలయ్య గౌడ్‌లు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో బీసీ సంఘం నేతలు మనోజ్ కుమార్, జోగు నరసింహ తదితరులు పాల్గొన్నారు.