హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు: బండి సంజయ్
16-07-2026 01:25 PM
హైదరాబాద్: సైదాబాద్ సెక్సెస్ స్కూల్ యాజమాన్యం తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్మా చదవాలని డైరీలో రాయడం దుర్మార్గమని, బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. సోకాల్డ్ సంఘాలు ఈ అంశంపై ఎందుకు స్పందించట్లేదు..? అని ప్రశ్నించారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, ఈ అంశాన్ని చూసీ చూడనట్లు వ్యవహరిస్తే రాష్ట్రమంతటా విస్తరిస్తోందని బండి సంజయ్ తెలిపారు.






