అమెరికా ఫెడ్ రిజర్వ్ లో ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక బాధ్యతలు
హైదరాబాద్: అమెరికా ఫెడ్ రిజర్వ్ లో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కు కీలక బాధ్యతలు చేపట్టారు. ద్రవ్య విధానాన్ని సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఏర్పాటు చేసిన కీలక టాస్క్ ఫోర్స్‌లలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఢిల్లీలో జన్మించిన ఆర్థికవేత్త రాజ్ చెట్టి, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఆశా శర్మ నియమితులయ్యారు. కొత్తగా నియమితులైన ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్, ద్రవ్య విధాన రూపకల్పనలోని కీలక రంగాలైన కమ్యూనికేషన్లు, బ్యాలెన్స్ షీట్ విధానం, డేటా, ఉత్పాదకత, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణ చట్రాలు వంటివాటిని పరిశీలించడానికి ఐదు టాస్క్ ఫోర్స్‌లను ప్రకటించారు.
ఫెడరల్ రిజర్వ్ ప్రకారం ఈ ప్యానెళ్లకు దాని సిబ్బంది మద్దతు ఉంటుంది. కానీ అవి ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC)కి సిఫార్సులు అందిస్తూ స్వతంత్రంగా పనిచేస్తాయి. బ్యాలెన్స్ షీట్ పాలసీ టాస్క్ ఫోర్స్ లో సభ్యుడిగా ఉన్న రఘురామ్ రాజన్ కు అమెరికా ఫెడరల్ బ్యాంక్ ద్రవ్య విధాన సంస్కరణల్లో భాగంగా బ్యాలెన్స్ సమీక్ష బాధ్యతలు అప్పగించింది. ద్రవ్యోల్బణం కట్టడికి అమెరికా ఫెడరల్ బ్యాంక్ లో ద్రవ్య విధాన సంస్కరణలను పునర్ రూపకల్పన చేసింది.






