కోనరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మనుక సత్యం
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మానుక సత్యం నియమితులయ్యారు.ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో నిమ్మపల్లి గ్రామ ఉపసర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనుక సత్యంకు ఈ బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా మనుక సత్యం మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్‌కు, పార్టీ సీనియర్ నాయకులకు మరియు కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, కార్యకర్తల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు.






