స్టేట్ ర్యాంకర్ బట్టు సౌమ్యకు రాష్ట్ర సలహాదారు కేశవరావు చే నగదు బహుకరణ
సుల్తానాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ ఎంసిహెచ్ఆర్డి నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యా విజయోత్సవాల్లో భాగంగా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో స్టేట్ మార్కు సాధించినటువంటి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం విద్యార్థిని బట్టు సౌమ్యకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, కాలేజ్ &టెక్నికల్ ఎడ్యుకేషనల్ కమిషనర్ దేవసేన చేతుల మీదుగా 25 వేల నగదు బహుమతిని అందించడం జరిగింది.
తాజాగా వెలువడిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో 1000 మార్కులకు గాను 994 మార్కులు సాధించి సౌజన్య రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఈ విద్యార్థినిని రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహక బహుమతి అందజేసి సత్కరించింది. అలాగే, ఎస్. కవిత సిఆర్టి ఇంగ్లీష్ 100 శాతం ఎఫ్ ఆర్ ఎస్ (హాజరు) నమోదు చేసినందుకుగాను ప్రశంసా పత్రాన్ని అందజేశారు. సౌమ్య స్టేట్ ర్యాంకు తీసుకువచ్చి తీసుకురావడం కేజీబీవీకి గర్వకారణమని,ఉపాధ్యాయుల సమిష్టి కృషి వలన ఇది సాధ్యమైనదని,సౌమ్య ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులందరూ చదువుల్లో రాణించాలని ఈ సందర్భంగా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఎం. స్వప్న సంతోషాన్ని వ్యక్తం చేశారు,






