బనిగండ్లపాడు గ్రామంలో తల్లి పాలు వారోత్సవాలు
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మండల పరిధిలో బనిగండ్లపాడు గ్రామంలో పి.హెచ్.సి.హాస్పిటల్ నందు తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్వైజర్ టి సరిత మాట్లాడుతూ... తల్లిపాలు అవగాహన క్లుప్తంగా పిల్లల తల్లికి తెలియపరిచారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. తల్లులకు బ్రెడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా ఎసిడిటీవో కృష్ణ శ్రీ మాట్లాడుతూ తల్లిపాలు అప్పుడే పుట్టిన బిడ్డనుండి ఆరు నెలల వరకు పట్టించాలని తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో తల్లులు పి హెచ్ సి డాక్టర్ ప్రశాంత్ కుమార్ పెద్ద గోపవరం సొసైటీ అధ్యక్షుడు శీలం అక్కిరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి గోపాల్ రెడ్డి సిహెచ్ఓ కాంతమ్మ పీహెచ్ఎన్ పద్మ ఆస్పత్రి స్టాప్ ఆశ వర్క్ అంగన్వాడీ టీచర్స్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.






