5 August, 2026 | 2:46 PM

ప్రజలతో మంత్రి సీతక్క ముఖాముఖి

05-08-2026 01:36 PM

హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గాంధీ భవన్‌లో నిర్వహిస్తున్న ప్రజలతో ముఖాముఖి(Prajalatho Mukhamukhi) కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ప్రజలే ప్రభుత్వానికి కేంద్రబిందువనే భావనతో ప్రతి బుధవారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి సీతక్క(Minister Seethakka ) నేరుగా వినతులు స్వీకరించారు.

ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలిస్తూ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు సీతక్క ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలు వినడమే కాకుండా వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పాలనలో ప్రజల సమస్యల పరిష్కారానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చిన ప్రతి వినతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు మంత్రి కీలక సూచనలు చేశారు.