20న మెడికల్ షాపుల దేశవ్యాప్త బంద్/పోస్టర్ ఆవిష్కరణ
17-05-2026 02:44 PM
రుద్రంగి,(విజయక్రాంతి): ఈ నెల 20 న బుధవారం రోజున ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపుమేరకు రుద్రంగి మండల కేంద్రంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాప్ బంద్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. 1.ఆన్లైన్లో మెడిసిన్ అమ్మకాలను నిషేధించాలని, 2. కార్పొరేట్ మెడికల్ షాపుల్లో అధిక డిస్కౌంట్లను ఆపాలని 3. సుపీరియర్ మెడిసిన్ విక్రయాలను నివారించాలని, ఈ మూడు ప్రధాన డిమాండ్లతో బంద్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ బందుకు ప్రజలు సహకరించాలని మండల అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చేశారు. అలాగే బంద్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. అలాగే రుద్రంగి మండల ఎస్సై కి వినతి పత్రం అందజేశారు.






