కళాకారుల అధ్వర్యంలో బోనాల ఉత్సవాలు
- పాల్గొన్న నగర మేయర్ కొలగాని శ్రీనివాస్
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని కళాకారుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ బోనం ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే విశిష్టమైన పండుగ అని మేయర్ పేర్కొన్నారు.
మన పండుగలు సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారాన్ని పెంపొందిస్తాయని, భావితరాలకు సంప్రదాయాలను అందించడంలో కళాకారుల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు, కళాకారులు, మహిళలు, భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు.






