7 August, 2026 | 4:50 PM

Breaking News

క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •   అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •   డీసీఎంను ఢీకొన్న ద్విచక్రవాహనం   •  

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సహకరించండి: రేవంత్ రెడ్డి

05-08-2026 02:16 PM

తుమ్మిడిహెట్టిపై కేంద్రం జోక్యం కోరిన రేవంత్ రెడ్డి

మహారాష్ట్రను ఒప్పించాలని వినతి

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో( Revanth Reddy Delhi Tour) బిజీగా ఉన్నారు. రాష్ట్ర సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై వరసగా కేంద్రమంత్రులను కలుస్తున్నారు. జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో(Jal Shakti Minister CR Patil) రేవంత్ రెడ్డి  భేటీ అయ్యారు. ⁠కేంద్ర మంత్రితో సీఎం భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు(Tummidihatti Project) ఎత్తు పెంపున‌కు మ‌హారాష్ట్రతో చ‌ర్చ‌ల‌కు జోక్యం చేసుకోవాల‌ని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. 148 మీట‌ర్ల ఎత్తు నిర్మాణానికి గతంలోనే మ‌హారాష్ట్ర అంగీక‌రించిన విష‌యాన్ని కేంద్ర మంత్రి పాటిల్‌కు గుర్తు చేశారు. 150 మీట‌ర్ల ఎత్తుతో నిర్మాణానికి మ‌హారాష్ట్రను ఒప్పించాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. 150 మీటర్లకు పెంచినా ముంపు 1000 హెక్టార్ల లోపు ఉంటుంద‌ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు తెలిపారు. తుమ్మిడిహెట్టి నిర్మాణంతో ఎత్తిపోత‌ల ఖ‌ర్చు లేకుండా గ్రావిటీతో నీటి స‌ర‌ఫ‌రాకు అవ‌కాశం ఉంటుంద‌ని కేంద్ర మంత్రికి రేవంత్ సూచించారు.