5 August, 2026 | 3:17 PM

ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరుపుకోవాలి

05-08-2026 02:23 PM

బోథ్,(విజయక్రాంతి): ఈనెల 9న నిర్వహించనున్న ఆదివాసి దినోత్సవాన్ని అన్ని గ్రామాల ఆదివాసీలు ఘనంగా జరుపుకోవాలని న్యాయవాది పంద్రం శంకర్ పిలుపునిచ్చారు బుధవారం మండలంలోని  అందూర్ నింగిని. కంటే గం మందబోకుడ గన్నూర్ నాగపూర్ గ్రామాలలో ఆదివాసులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలందరూ సంస్కృతి సాంప్రదాయాలతో ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సార్ మేడిలు ఆడం భీమ్రావు, మడవి దేవరావ్ అందరు సర్పంచ్ పెందుర్తి పృథ్వి కరో బరిమడవి రామారావు కంటేగా మాజీ సర్పంచ్ నైతం కేశవ్, నిగ్ని మాజీ సర్పంచ్ భూమేష్, పాట్నాపూర్ మాజీ సర్పంచ్ గోపాల్ ,మాజీ ఎంపీటీసీ దేవిదాస్ తదితరులు ఉన్నారు.