2 July, 2026 | 12:25 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

ముంబై వేదికగా మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్‌కు జాతీయ గౌరవం

18-02-2026 01:21 AM

37వ హెవీ వాటర్ దినోత్సవంలో ఉత్తమ ప్రతిభ పురస్కారం

అశ్వాపురం, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ముంబైలో అణుఊర్జా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 37వ హెవీ వాటర్ దినోత్సవం2026 కార్యక్రమంలో మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్కు 2026 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ పురస్కారం ప్రదానం చేశారు. మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ జనరల్ మేనేజర్ జి. శ్రీనివాస్ నాయకత్వంలో ప్లాంట్ సాధించిన అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.

దేశవ్యాప్తంగా ఉన్న హెవీ వాటర్ ప్లాంట్లలో విశిష్ట ప్రదర్శన కనబర్చినందుకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్లాంట్ అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, కాంట్రాక్టర్లు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు, డీఆర్సీసీ మరియు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది సహా పరోక్షంగా సేవలందించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఈ అవార్డు అందుకోవడం ప్లాంట్కు గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అణుఊర్జా విభాగం చైర్మన్ అజిత్ కుమార్ మహంతి, మాజీ చైర్మన్ ఏ.ఎన్. వ్యాస్, అణుఊర్జా మరియు అంతరిక్ష కమిషన్ సభ్యురాలు శ్రీమతి శ్రీమాజేన్, భాభా అణు పరిశోధన కేంద్రం డైరెక్టర్ వివేక్ భాసిన్, హెవీ వాటర్ బోర్డు ముఖ్య కార్యనిర్వాహక అధికారి సత్యకుమార్, డైరెక్టర్ వి.వి.ఎస్. ప్రసాద్, కె.వి. తాలే తదితర ప్రముఖులు పాల్గొన్నారు.