వృద్ధురాలు దారుణ హత్య..?
02-07-2026 12:14 PM
కోహెడ, జులై 2, (విజయక్రాంతి): మండలంలోని పోరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధి అప్పిస కాలనీలో అప్పిస బుచ్చమ్మ (85) బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి చంపి వేసి తన మెడలో ఉన్న రెండు తులాల బంగారం గొలుసు, కాళ్లకు ఉన్న 50 తులాల వెండి కడియాలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఎస్సై పుల్ల అభిలాష్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. దుండగల వివరాలు తెలియాల్సి ఉంది.






