18-02-2026 01:19:33 AM
ఉట్నూర్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): అది అడవుల జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతం. జల్.. జంగల్... జమీన్... కోసం ఆదివాసీలు ప్రాణాలకు తెగించి పోరాడిన రోజు. అప్పుడే పోలీసులకు ఆదివాసీలకు మధ్య జరిగిన పోరులో పోలీసుల తూటాలకు ఎందరో అమరులయ్యారు.
అదే ఇంద్రవెల్లి లో జరిగిన పోరు. 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి లో గిరిజనులకు పోలీసులకు జరిగిన పోరులో పోలీస్ తూటాలకు ఎదురొడ్డి పోరాడిన వీర వనిత మడవి జంగుబాయి (70) సోమవారం రాత్రి కన్ను మూసింది.
ఇంద్రవెల్లి మండలం పిట్ట బొంగరం గ్రామానికి చెందిన మడవి జంగు బాయి 1981 ఏప్రిల్ 20న జరిగిన ఇంద్రవెల్లి పోరులో ప్రత్యక్షంగా పాల్గొంది. వీర వనిత మడవి జంగు బాయి మరణించిన విషయం తెలియగానే రాజ్ గోండ్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ సోయం బాపూరావు తీవ్ర సంతాపం తెలిపారు.