18-02-2026 01:21:16 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి ౧౭ (విజయక్రాంతి): శ్రీ సంత్ సేవాలాల్ చూపిన మార్గం సమాజానికి మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ కే.హరిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో గిరిజన సంక్షేమ శాఖ, సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొని భోగ్ బండార్ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో బంజారా భవన్, సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గిరిజన సంస్కృతి పరిరక్షణతో పాటు ప్రభుత్వ పథకాల ద్వారా అభివృద్ధి సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, మహిళలు సహా పెద్ద సంఖ్యలో లంబాడి గిరిజనులు పాల్గొన్నారు.