పిల్లలమర్రి దేవాలయాలను సందర్శించిన మణికొండ వేదకుమార్
సూర్యాపేట రూరల్, జులై 26 :ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటజ్ కేంద్ర కమిటీ సభ్యులు మణికొండ వేదకుమార్ ఆదివారం నల్లగొండ జిల్లా స భ్యులు పెద్దిరెడ్డి గణేష్ తో కలిసి జిల్లా కేం ద్రం సమీపంలోని పిల్లలమర్రి దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రా మంలోని దాదాపు వెయ్యి సంవత్సరాల పురాతన దేవాలయాలు ఎరుకేశ్వర ఆల యం, త్రికూటేశ్వర ఆలయాలు అక్కడ ఉన్న చారిత్రిక ఆనవాళ్లు శాసనాలను పరిశీలించారు.
జిల్లా సభ్యులు పెద్దిరెడ్డి గణేష్ అం దించిన చరిత్ర వివరాలను అక్కడున్న శిల్ప సంపదతో సరిపోల్చి ముగ్ధులయ్యారు. త్వర లో పిల్లలమర్రి దేవాలయాల గురించి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మించి ఢిల్లీ సంస్థకు అందిస్తానని అన్నారు.తద్వారా కేంద్ర,రాష్ట్ర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా నిధులు సాధించి ఇటువంటి గొప్ప జాతీయ సంపదలను కాపాడి ముందు తరాలకు అందించ వచ్చని చెప్పారు.అంతకు ముందు జిల్లా కేంద్రంలోని సుధా బ్యాంక్ వద్ద వేదకుమార్ కి ఇంటాక్ సభ్యులు భోనగిరి భాస్కర్,ధనంజయ తదితరులు ఘన స్వాగతం పలికారు.






