30 May, 2026 | 10:49 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు

30-05-2026 10:14 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని నాగుపల్లి గ్రామానికి చెందిన మేకా మాన్విత నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతూ ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాలలో 571 మార్కులతో మండలంలో మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా విడుదల చేసిన ఆర్జీయుకెటి (RGUKT) బాసర ఫలితాల్లో సీటు సంపాదించడంతో తల్లితండ్రులతో పాటు దమ్మపేట మండల విద్యాశాఖాధికారి జగపతి, నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బజ్జూరి సరళ, గ్రామ ప్రజలు మాన్వితకు అభినందనలు తెలిపారు.