30 July, 2026 | 3:52 PM

ఎస్ జె కే యం కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనకై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

30-07-2026 03:19 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎస్ జె కే యం కళాశాలలో గురువారం నాడు ప్రొహిబిషన్ ఎక్సైజ్ మధిర శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలనకై మధిర ఎక్సైజ్ సీఐ రాములు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు కారాదని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను ఆశించాలని తల్లిదండ్రుల లక్ష్యాలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నాగిరెడ్డి సౌజన్య, అధ్యాపకులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.