30 July, 2026 | 3:27 PM

అలుగు దూకని కరత్వాడ చెరువు నీరు

30-07-2026 03:16 PM

బోథ్,( విజయక్రాంతి): బోథ్, బజార్హత్నూర్ నేరడిగొండ మండలాలలో బుధవారం తెల్లవారుజాము నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం స్తంభించింది. గ్రామాల సమీపంలోని వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో ప్రజలు ఇండ్లు విడిచి బయటకు రాలేకపోతున్నారు. బజారత్నూర్ మండలంలోని కాన్లి, భూతాయి బూత్ మండలంలోని కరత్వాడ, దన్నూర్ వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది.

నక్కల వాడ వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు రెండు రోజుల నుండి అంతరాయం కలుగుతున్నది, కరత్వాడ,కొత్తపల్లి, రేండ్లపల్లి తదితర గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. నక్కలవాడ గ్రామం సమీపంలో వాగు బ్రిడ్జి పైనుండి ప్రవహిస్తుండడంతో ప్రజలను రెవెన్యూ పోలీస్ అధికారులు అప్రమత్తం చేశారు. స్థానిక పోలీసులు బ్రిడ్జి వద్ద కాపలాగా ఉండి ప్రజలను వరద నీటిలోకి వెళ్లకుండా చూశారు.