గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా పెద్దపల్లి జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా యువతకు ఉపాధి మార్గాలను సుగమం చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద ప్రధానంగా ఐటీఈఎస్, లాజిస్టిక్స్, టెలికాం, వ్యవసాయం గృహోపకరణ, దుస్తుల తయారీ, అందం, సంరక్షణ, టూరిజం, హాస్పిటాలిటీ, ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, హెల్త్ కేర్ ,వంటి రంగాలలో నైపుణ్యాలను అందించడం జరుగుతుంది.
శిక్షణ అనంతరం అర్హులైన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, జిల్లాకు చెందిన ఆసక్తి గల నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం కరీంనగర్‌లోని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించవచ్చు అని పూర్తి వివరాల కోసం 9441174822 నంబరు నందు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.






