పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం
30-05-2026 10:10 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలోని హరిజనవాడలో కంచర్ల రహదారి పక్కన శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. సమీపంలో నిలిపి ఉంచిన అదే గ్రామానికి చెందిన బాగారెడ్డి ట్రాక్టర్ మంటల్లో చిక్కుకునిఉండగా అప్రమత్తంగా డ్రైవర్ బయటకు తీసాడు కానీ ముందు భాగం దెబ్బతింది.
సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ కోడూరి సాయాగౌడ్ అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది,భిక్కనూర్ పోలీసులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.






