20 June, 2026 | 10:25 PM

మొండి బకాయిల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి

20-06-2026 09:06 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మండల సమైక్య కార్యాలయంలో మండల సమైక్య ఈసీ సమావేశం మండల ఇన్చార్జి ఏపిఎం కొమ్మ దత్తు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సంస్థగత నిర్మాణం,బ్యాంకు రుణాలు, శ్రీనిధి మొండి బకాయిలు వసూలు, స్కూల్ పిల్లల యూనిఫామ్, గ్రామ సంఘాల భవన నిర్మాణాలు తదితర అంశాల గురించి చర్చించడం జరిగిందని మండల ఇన్చార్జి ఏపిఎం కొమ్మ దత్తు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రామ సంఘాల ద్వారా బ్యాంకు లీకేజీ సబ్ కమిటీలు మరియు సిబ్బంది ఉమ్మడి భాగస్వామ్యంతో పేరుకుపోయిన మొండి బకాయిల వసుళ్ళకు స్పెషల్ డ్రైవ్ చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు.కొమ్మ దత్తు సీసీ నుండి మండల ఇన్చార్జి ఏపిఎం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయా గ్రామాల సంఘ సభ్యులు అభినందనలు తెలియజేశారు.