మందకృష్ణ బాటలో పునరంకితం అవుదాం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ
కామారెడ్డి,(విజయక్రాంతి): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన తోపాటు, సామాజిక ఉద్యమ పోరాటాలైన గుండె జబ్బు పిల్లల ఉద్యమం, వికలాంగుల ఉద్యమం ప్రమోషన్లో రిజర్వేషన్, రేషన్ బియ్యం పెంపు లాంటి అనేక పోరాటాలు చేసి మాదిగల ఉద్యమాన్ని మానవతా ఉద్యమంగా సామాజిక ఉద్యమ నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తీర్చి దిద్దారని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంథని సామెల్ మాదిగ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామం లో ఆవిర్భవించిన ఎమ్మార్పీఎస్ ఈరోజు 32 సంవత్సరాలు పూర్తి చేసుకుని దేశవ్యాప్త ఉద్యమాలకు సిద్దం అవుతుందని అన్నారు.
ఎమ్మార్పీఎస్ శ్రేణులతోపాటు అన్ని విభాగాల శ్రేణులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమ పిలుపు లో పునరంకితం కావాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 32 వ ఆవిర్భావ దినోత్సవం, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 62 వ జన్మ దినాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కాగా సీనియర్ నాయకులు కొత్తోల్ల యాదగిరి మాదిగ బట్ట వెంకట్రాములు మహిళా విభాగం నాయకురాలు సట్టిగారి లక్ష్మి మాదిగ,రేణుక విహెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు బాలరాజు గౌడ్, రామారెడ్డి మండల అధ్యక్షుడు రాజనర్సు,మావురం శ్రీకాంత్, శైలేష్ సాయి వరుణ్ ఎల్లయ్య విహెచ్ పి ఎస్ నాయకులు రాజనర్సు అఫీజా తదితరులు పాల్గొన్నారు.






