6 July, 2026 | 3:43 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •  

ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభించిన మంచరామి సర్పంచ్ ఉప్పులక్ష్మి తిరుపతి

08-05-2026 01:12 AM

సుల్తానాబాద్ , మే 7 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచిరామి గ్రామం నుండి కరీంనగర్ కు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును గ్రామ సర్పంచ్ ఉప్పు లక్ష్మీ తిరుపతి   మంచిరామి బస్ స్టాండ్ లో గురువారం ప్రారంభించారు. బస్సు రావడానికి కృషి చేసిన ప్రభుత్వ విప్ ,పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, కరీంనగర్, హుజురాబాద్ ఆర్టీసీ అధికారులకు గ్రామస్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే దిశగా ఈ బస్సు సేవలు ఎంతో ఉపయోగపడతాయని సర్పంచ్ పేర్కొన్నారు. ఉప్పు లక్ష్మీ తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచిరామి నుండి కరీంనగర్ కు బస్సు సౌకర్యం కల్పించినందుకు ప్రజలు ఎంతో సంతోషిస్తూ సర్పంచ్ ఉప్పు లక్ష్మి తిరుపతి లకు కృతజ్ఞతలు తెలిపారు..