పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి
06-07-2026 02:37 PM
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా పురగిరి క్షత్రీయ పెరిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీటీసీ మేడం తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని తిరుపతి పేర్కొన్నారు. తిరుపతి నియామకం పట్ల జిల్లా అధ్యక్షులు బొడ్డు శంకర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్, మహిళా అధ్యక్షురాలు అత్తి సరోజ, ఆత్మ చైర్మన్ సింగతి మురళి, జిల్లా నాయకులు బేర సత్యనారాయణ, సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.






