కౌశిక్ రెడ్డి సవాల్‌కు ప్రతి సవాల్
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు
ముకరంపుర, మే 7 (విజయక్రాంతి): పెళ్లికి... చావుకి ఓకే వాయిద్యం వాయిస్తున్నట్లుగా బీఆర్‌ఎస్ నాయకుల పరిస్థితి ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లో ఇటీవల జరిగిన దోపిడి విషయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై బీఆర్‌ఎస్ నాయకులు చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ.. ఫైర్ అయ్యారు.
గురువారం వీలేకరుల సమావేశంలో యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... శాంతి భద్రతలు ఎవరి చేతుల్లో ఉంటాయో అనే విషయం తెలియకపోవడం సిగ్గుచేటని ద్వజ మెత్తారు. ఎక్కడైన అవాంఛనీయ ఘటనలు జరిగితే ఖండిచాల్సింది పోయి... బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డితో ములాకత్ అయ్యారని... ఆవాకులు చేవాకులు పలకడం మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రతి అంశంలో నిలదీస్తూ....తప్పిదాలను ఎత్తి చూపి విమర్శలు చేస్తున్న నాయకులు కేవలం బండి సంజయ్ మాత్రమే అన్నారు.
ఈ విషయాన్ని చూడకుండా... కళ్ళుండి చూడలేని కబోదుల్లా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తయారయ్యారని ఎద్దేవ చేశారు.ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్లు ఒంటెల సత్యనారాయణ రెడ్డి, సౌగాని కొమురయ్య, పొన్నం మొండయ్య-లక్ష్మి, పాల్గొన్నారు.






