లక్షెట్టిపేట సీడీపీఓగా మానస బాధ్యతల స్వీకరణ
03-06-2026 01:50 PM
లక్షెట్టిపేట, జూన్ 3: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO)గా మానస బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీడీపీఓగా విధులు నిర్వహించిన రేష్మ తొర్రూరు ప్రాజెక్టుకు బదిలీ అయ్యారు. నిర్మల్ సీడీపీఓగా పనిచేస్తున్న మానసను లక్షెట్టిపేటకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీడీపీఓ మానస మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పౌష్టికాహారం అందేలా చూస్తామని, కేంద్రాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.






