calender_icon.png 19 February, 2026 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యాపేటలో ప్రేమోన్మాది దారుణం

19-02-2026 02:51:10 PM

సూర్యాపేట,(విజయక్రాంతి): ఓ ప్రేమోన్మాది తాను ప్రేమించిన యువతి దూరం పెడుతుందని ఆమెపై సుత్తితో దాడికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్నేహ నగర్‌లో ప్రాంతంలో గురువారం జరిగింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం నూతనకల్ మండలం(Nuthankal Mandal) లింగంపల్లి గ్రామానికి చెందిన బోయిండ్ల మహేష్ అనే వ్యక్తి ఆ గ్రామానికి పక్కనే ఉన్న మరో గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించినట్లు తెలిపారు. అయితే యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమె అతనితో దూరంగా ఉంటూ సూర్యాపేటలో తన సోదరి ఇంట్లో ఉంటున్నట్లు తెలిపారు. కాగా గురువారం ఉదయం ఎవరు లేని సమయంలో యువతి ఇంట్లోకి దూరి వాదనకు దిగి సుత్తితో ఆమె తలపై దాడి చేసియినట్లు తెలిపారు.

ఆమె కేకలు వేయడంతో గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారన్నారు. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. అలాగే నిందితుడిని పొలిసులు అదుపులోకి తీసుకున్నారు.  అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించినట్టు తెలుస్తుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.