దుర్గం చెరువు కాలుష్యాన్ని అరికట్టండి
16-07-2026 01:51 AM
- మునిసిపల్ కమిషనర్ శ్రీజన
- ‘విజయక్రాంతి కథనానికి స్పందన’
శేరిలింగంపల్లి, జూలై 15 (విజయక్రాం తి): మాదాపూర్ దుర్గం చెరువు కాలుష్యంపై ఈ నెల 5న ‘విజయక్రాంతి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. చెరువులోకి మురుగునీటి ప్రవాహాన్ని పూర్తి గా నిలిపివేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
బుధవారం సీఎంసీ కమిషనర్ శ్రీజన, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు అధికారులతో కలిసి కమిషనర్ దుర్గం చెరువు ఎస్టీపీ, ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్ వ్యవస్థను పరిశీలిం చారు. చెరువులోకి చేరుతున్న మురుగునీటి ప్రవాహాలను క్షేత్రస్థాయిలో సమీక్షించి, అమలులో ఉన్న మళ్లింపు ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.






