13 May, 2026 | 3:03 AM

గోపతండా ఉప సర్పంచ్‌గా మాలోతు ఈశ్వరి రవి

16-12-2025 07:35 PM

మోతె,(విజయక్రాంతి): మండల పరిధి లోని గోపతండా గ్రామానికి చెందిన మాలోతు ఈశ్వరిరవి గ్రామ ఉప సర్పంచ్‌గా ఎన్నికయింది. ఈ సందర్భంగా పలువురు ఆమెను మంగళవారం అభినందించారు. తదుపరి ఆమె మాట్లాడుతూ... నాపై నమ్మకం ఉంచి ఉప సర్పంచ్‌గా ఎన్నుకునేందుకు సహకరించిన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సర్పంచ్ భూక్య బిక్కుతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తన వంతు సహకారం అందిస్తామన్నారు.