22 July, 2026 | 2:29 AM

ఘనంగా మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు

22-07-2026 01:43 AM

సత్తుపల్లి జూలై21 (విజయ క్రాంతి): ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి, అందరికీ మిఠాయిలు పంపిణీ చేసి,ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ మట్టా మాట్లాడుతూ విధివిధానాలతో కాంగ్రెస్ పాలనను ముందుకు నడిపిస్తున్నారని,మంచి నాయకుడు పుట్టినరోజులు జరుపుకోవడం  అదృష్టమని ,ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని అందజేయాలని, ముందు ముందు ప్రజలకు మరింత సేవలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రెహానా కమల్,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, వార్డ్ కౌన్సిలర్ మౌలాలి, బీసీ లీడర్ నారాయణవరపు శ్రీనివాస్, ఆంగోతు రామారావు  పింగళి సామేలు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.