22 July, 2026 | 2:28 AM

పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలి

22-07-2026 01:42 AM

సత్తుపల్లి, జూలై21(విజయ క్రాంతి):  లలిత కుమారి హాస్పిటల్ రోడ్ లో గల,బీసీ బాలుర వసతి గృహాన్ని,రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ మంగళవారం పరిశీలించారు. పిల్లల రూమ్ లను, బాత్ రూమ్, తయారుచేసిన ఆహారాన్ని, పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల హాస్టల్ ను  పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్య కరమైన భోజనం విద్యార్థులకు అందించాలని తెలియజేశారు. వర్షాకాల దృష్ట్యా పరిశుభ్రత పై పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. పరిశీలించిన వారిలో మున్సిపల్ చైర్ పర్సన్ రెహానా కమల్, వైస్ చైర్ పర్సన్ బొంతు సుమలత వేణు, గ్రాండ్ మౌలాలి, శరత్ చంద్ర, వీరివాడ అపర్ణ, పట్టణ అధ్యక్షుడు గాదే చెన్నారావు,కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.