26 May, 2026 | 4:27 AM

ఉస్మాన్ నగరంలో ఘనంగా మల్లన్న, బీరప్ప జాతర

26-05-2026 12:00 AM

హాజరైన బీఆర్‌ఎస్ ఇంచార్జి ఆదర్శ్ రెడ్డి

రామచంద్రపురం, మే 25 : రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగరంలో మల్లికార్జున భ్రమరాంభిక బీరప్ప  జాతర కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులకు మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేష్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం నిర్వహంచారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, డోకూరి రవీందర్ రెడ్డి, రామ్ మోహన్ రెడ్డి, మల్లేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సి.ప్రభాకర్ రెడ్డి, బాబు గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మల్లన స్వామి అశీస్సులు అందరి పైనా ఉండాల కోరారు. కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్, ప్రేమ్ కుమార్, శ్రీశైలం, అనిల్, మల్లేష్, ఆలయ కమిటీ సభ్యులు శ్రావణ్, సాయి, కొమురయ్య, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.