యాక్షన్, ఎమోషనల్ ‘గర్జించే పోలీస్’
* యాక్షన్, ఎమోషన్ అంశాలతో తెరకెక్కుతున్న చిత్రం ‘గర్జించే పోలీస్’(Roaring police). రామశర్మ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మణి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం బాధ్యతలను టీ రాము నిర్వర్తిస్తున్నారు. ఇందులో అభిషేక్, సురభి వీణ, సురభి అరుణాదేవి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. రామశర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌గా సర్వేపల్లి వెంకన్న, సంగీత దర్శకుడిగా అనిల్ కుమార్, ఎడిటర్‌గా వేణు చౌదరి, ఫైట్స్ మాస్టర్‌గా శివలింగం పనిచేస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
* ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, నిర్మాత రామశర్మ మాట్లాడుతూ.. “గర్జించే పోలీస్’ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. దర్శకుడు రాము సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. పాటలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సాంగ్‌కు మంచి ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నా” అని చెప్పారు.
* హీరోయిన్ మణి మాట్లాడుతూ.. “గర్జించే పోలీస్’ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. సాంగ్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. చిత్రబృందం ఎంతో కష్టపడి సినిమాను రూపొందిస్తోంది. ప్రేక్షకులు సినిమాను తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నా” అని తెలిపింది.
* దర్శకుడు టీ రాము మాట్లాడుతూ.. “గర్జించే పోలీస్’ సాంగ్ లాంచ్ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. సినిమా విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. ప్రేక్షకులను ఆకట్టుకునేలా యాక్షన్, ఎమోషన్ అంశాలతో సినిమాను రూపొందిస్తున్నాం. పాటలకు మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నా” అని తెలిపారు.
* సాయి వెంకట్ మాట్లాడుతూ.. “గర్జించే పోలీస్’ సినిమాలోని పాటలు చాలా సూపర్‌గా ఉన్నాయి. సాంగ్ చాలా బాగుంది. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. ఈ కార్యక్రమంలో చందా లక్ష్మీనారాయణ నాయక్, మళ్లెం వేణుమాధవ్, ప్రవీణ్, శ్రీనివాస్, చిత్ర యూనిట్ సభ్యులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.






