27 August, 2026 | 6:14 PM

మల్కాజిగిరి వేగంగా అభివృద్ధి చెందాలి

27-08-2026 01:16 AM

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి, ఆగస్టు 26, (విజయక్రాంతి): స్వామి వారి ఆశీస్సులతో మల్కాజిగిరి నియోజక వర్గం మరింత వేగంగా అభివృ ద్ధి చెందాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆనంద్ బాగ్ చౌ రస్తాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆల య వార్షిక బ్రహ్మోత్స వాలు సందర్భంగా బుధవారం ఆలయంలో  నిర్వ హించిన అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు.

ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజకు హజరైన ఆయనను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శా లువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ, స్వామి వారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్ర మంలో దేవాలయ కార్య నిర్వహణ అధికారి రవీం దర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్, పరశురాంరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, చిన్న యా దవ్, చంద్రమౌళి, ప్రభాకర్ గౌడ్, నర్సింగ్, మల్లేష్ యాదవ్, కేబుల్ రమేష్, శ్రీకాంత్, నవీన్, సురేష్, బాలకృష్ణ, ఉమేష్, ఉమా పతి, సూర్యకుమారి, వైశాలి, గౌస్ ఇమ్రాన్, నర్సింగ్ రావు తదితరులు  పాల్గొన్నారు.