30 June, 2026 | 1:55 AM

దత్తత సహాయ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి

30-06-2026 01:03 AM

కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్, జూన్ 29 (విజయక్రాంతి): పిల్లల దత్తత ప్రక్రియను పారదర్శకంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన దత్తత సహాయ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్లో దత్తత సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, దత్తత తీసుకోవాలనుకునే వారు మధ్యవర్తులను ఆశ్రయించకుండా ప్రభుత్వ గుర్తింపు పొందిన విధానాల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రతి చిన్నారికి కుటుంబ వాతావరణం కల్పించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి దమయంతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.