ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాల వైపు
30-06-2026 01:05 AM
కోయిలకొండ జూన్ 29: మండలంలో రాంపుర్ గ్రామంలో ప్రవేట్ పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులను ఆ గ్రామ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి గ్రామంలోని అన్ని ప్రైవేటు స్కూల్ కు వెళ్తున్న విద్యార్థులను బంద్ చేసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.
విద్యార్థులు అందరికీ నోటుబుక్కులు ఉచితంగా పంపిణీ చేశారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని గ్రామంలో విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలలో చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ముజుద్దీన్ పాల్గొని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు రాంపూర్ విలేజ్ ని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపాలని కోయిలకొండ మండల ఎంఈఓ తెలిపారు. విద్యార్థులు ఉన్నారు.






