పోష్ యాక్ట్‌పై అవగాహన ఉండాలి
30-06-2026 01:54 AM
జిల్లా కో ఆర్డినేటర్ చైతన్య
కోదాడ, జాన్ 29 : మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం వారి ఆధ్వర్యంలో సోమవారం కోదాడ పట్టణంలోని మురళీ కృష్ణ ధాబా నందు మహిళలకు పోష్ యాక్ట్-2013 పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆర్డినేటర్ చైతన్య మాట్లాడుతూ మహిళలు తాము పనిచేసే చోట ఎలాంటి ఇబ్బందులు లేకుండా, గౌరవప్రదమైన వాతావరణంలో పనిచేసేలా రక్షణ కల్పించడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆమె వివరించింది. మహిళలు వేధింపులను మౌనంగా భరించకుండా, చట్టంపై అవగాహనతో ధైర్యంగా నిలబడాలని. ప్రతి పని ప్రదేశంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ వినోద్, దాబా ఓనర్ మురళీ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.






