ఏఐవైఎఫ్ తాండూర్ మహాసభలను జయప్రదం చేయండి
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): తాండూర్ మండల కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ లో ఈ నెల 22న జరగనున్న అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) తాండూర్ మండల 3వ మహాసభలను జయప్రదం చేయాలని, సీపీఐ మండల కార్యదర్శి కొండు బానేష్ కోరారు. ఈ మహా సభకు జిల్లా కార్యదర్శి లింగం రవి ఈ సభలకు హాజరు అవుతారని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.1959 నుండి నేటి వరకు సమరశీల పోరాటాలు జరిగాయన్నారు. విభజనుల కోసం, నిరుద్యోగ యువత పడుతున్న బాధలు, ఎటువంటి షూరిటీ లేకుండా బ్యాంకు లోన్లు ఇవ్వాలని, ఖాళీగా ఉన్నటువంటి అన్ని శాఖల్లో రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని పోరాడామన్నారు. యూత్ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నా ప్రభుత్వం వెంటనే దానిని అమలు చేయాలని కోరారు. వీటన్నిటి కోసం అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) సమరశీల పోరాటాలకు, దశల వారి పోరాటాలకు ఈ మహాసభల్లో తీర్మానాలు జరుగుతాయని వెల్లడించారు. యువతీ,యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి హాజరవుతారని ఆయన అన్నారు.






