21 August, 2026 | 7:04 PM

సరస్వతి శిశు మందిర్‎లో వరలక్ష్మి ప్రత్యేక పూజలు

21-08-2026 04:58 PM

బోథ్. ఆగస్ట్ 21 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థులు శుక్రవారం వరలక్ష్మీ పూజా కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొని వరలక్ష్మి వ్రత ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.