21 August, 2026 | 4:56 PM

విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు

21-08-2026 03:49 PM

కరీంనగర్ క్రైమ్ ఆగష్టు 21(విజయక్రాంతి): మున్నూరు కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి నేడు కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రెహమత్ హుస్సేన్ తో కలిసి కరీంనగర్ లోని తన నివాసంలో పత్రిక విలేకరులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి  మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుంటే, నిన్న కరీంనగర్ పర్యటనలో  భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు  కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా, డొల్లతనంగా ఉన్నాయని విమర్శించారు. 


కరీంనగర్ ఆర్.ఓ.బి నిర్మాణం ఏడాది గడిచినా పూర్తి కాకపోవడం వల్ల రోగులు, అంబులెన్స్ లు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర నిధుల పేరుతో ఆరోపణలు మాని వెంటనే బ్రిడ్జి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పీఎం ఆవాస్ యోజనలో కేంద్ర-రాష్ట్ర వాటాలను స్పష్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  నాయకులు ఏం డి తాజ్, వెన్నం రజిత రెడ్డి,మాదాసు శ్రీనివాస్,చింతల్ కిషన్, కూడలి శ్రీధర్, అబ్దుల్ రెహమాన్,అమీర్,  కుంభాల రాజు కుమార్,సామ్రాట్, బొమ్మ రాతి సాయి  పాల్గొన్నారు.