నీటి వనరుల వినియోగంపై రైతులను ప్రోత్సహించండి
21-08-2026 04:39 PM
బోథ్. ఆగస్టు 21 ( విజయ క్రాంతి): వర్షా బావ పరిస్థితుల వల్ల నీటి నిలువ సామర్థ్యం తగ్గుతూ ఉండడంతో ప్రతి నీటి బొట్టును భూమిలోకి ఇంకే విధంగా చూడాలని అందుకు రైతులను ప్రోత్సహించాలని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. ప్రతి గ్రామానికి రెండు ఫామ్ పండ్ల నిర్మాణం జరిగే విధంగా చూడాలన్నారు. అంతేగాక బోరు బావుల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, మరోవైపు కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏపీవోతో పాటు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.






